‘క్రాక్’కి మ్యూజిక్ బాగా వస్తోందట !

‘క్రాక్’కి మ్యూజిక్ బాగా వస్తోందట !

Published on Feb 16, 2020 11:00 PM IST

డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని – మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్ లో రాబోతున్న ‘క్రాక్’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. గత వారం చీరాలలోని రామాపురం బీచ్ లో ఈ చిత్రం సాంగ్ షూటింగ్ జరుపుకుంది. కాగా క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే తమన్ సాంగ్స్ తో పాటు షూట్ చేసిన సీన్స్ కు సంబధించిన నేపథ్య సంగీతం మీద వర్క్ మొదలుపెట్టారట. అవుట్ ఫుట్ చాల బాగా వస్తోందని.. తమన్ నుండి మరో సూపర్ హిట్ ఆల్బమ్ రాబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమాని 2020 సమ్మర్ లో విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట.

ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ నటించిన డిస్కో రాజా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ లో పాయల్ రాజ్ పుత్, నాభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు