అరె ఎన్నాళ్లకూ.. ‘తెనాలి రామకృష్ణ’ అప్ డేట్ ఇచ్చాడు !

Published on May 5, 2019 7:00 pm IST

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. కాగా తాజాగా ఈ చిత్రం ప్రీ లుక్ పోస్టర్ ను వదిలింది చిత్రబృందం. అలాగే మే 7న సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో మంచి హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు. ఆ స్థాయిలో హిట్ నూ అందుకోలేదు. అందుకే ఈ సారి ఎలాగైనా ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డితో ఈ ‘తెనాలి రామకృష్ణ బిఎ. బిఎల్’ను చేస్తున్నాడు.

కాగా ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కతున్న ఈ చిత్రంలో సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వస్తోందట.. ముఖ్యంగా సందీప్ కిషన్ చుట్టూ జరిగే డ్రామా.. ఆ డ్రామా కారణంగా హీరో పడే ఇబ్బందులు.. ఆ ఇబ్బందులకు హీరోయిన్ పెట్టే టార్చర్.. ఆ టార్చర్ నుండి తప్పించుకోవడానికి హీరో చేసే పనులు.. ఆ పనులకు మిగిలిన పాత్రలు ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాయి, లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి తెనాలి రామకృష్ణ ఫుల్ కామెడీతో రాబోతున్నాడు అన్నమాట. మరి ఈ చిత్రంతోనైనాసందీప్ కిషన్ హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More