‘ది రాజా సాబ్’ మేకర్స్ నుంచి ఇంట్రెస్టింగ్ మూవ్

‘ది రాజా సాబ్’ మేకర్స్ నుంచి ఇంట్రెస్టింగ్ మూవ్

Published on Dec 12, 2025 3:01 PM IST

The-Raja-Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ది రాజా సాబ్. మంచి హైప్ ఉన్న ఈ సినిమా గ్రాండ్ విజువల్ అండ్ హారర్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఆన్ టైం రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ మూవ్ ని అనౌన్స్ చేశారు.

దర్శకుడు ఓ వీడియోతో తమ రాజా సాబ్ రిలీజ్ కి ముందు తమ రాజా సాబ్ ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నామని తెలిపారు. అసలు సినిమా ప్రపంచాన్ని ఎలా సృష్టించారు. దీని వెనుక ఉన్న కష్టం, సెట్స్ ఇంకా వి ఎఫ్ ఎక్స్ పనుల్లో ఏం జరిగింది అనే లాంటి వాటి జర్నీపై ఒక వీడియో లాంటి ట్రీట్ ని త్వరలోనే అందిస్తాం అన్నట్టుగా తెలిపారు. సో ఇంకొన్ని రోజుల్లో రాజా సాబ్ పై మంచి ట్రీట్ ఆన్ ది వే అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు