పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది రాజాసాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ పండుగ సీజన్‌లో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుండటంతో ‘రాజాసాబ్’ ఏమాత్రం ఆలస్యం కాకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు ముగించేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. ఈ సోమవారం లేదా మంగళవారం సెన్సార్‌కు రాజాసాబ్ చిత్రం వెళ్లనుంది.
దీంతో వీలైనంత త్వరగా సెన్సార్ పనులు ముగించుకుని, ఆ తర్వాత ప్రమోషన్స్‌తో స్పీడందుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.


