ఏపీలో థియేటర్స్ తెరుచుకునేది అప్పుడే అట.!

Published on Jul 3, 2021 10:02 pm IST


ప్రపంచం అంతా ఎదుర్కొన్న కరోనా సంక్షోభం నుంచి మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. గత ఏడాది తీరని దెబ్బ కొట్టిన కరోనా ఈ ఏడాది మరింత స్థాయిలో విజృంభించింది. అయితే దీని మూలాన బాగా నష్టపోయింది, ఇప్పటికీ నష్టాలను చూస్తుంది సినీ పరిశ్రమకి చెందిన థియేటర్స్ అనే చెప్పాలి.

ఇప్పటికే ఎన్నో థియేటర్స్ మూత పడిపోయాయి. అలాగే మరోపక్క వేవ్ తగ్గుతున్న సమయంలో స్వల్ప కాలం మళ్ళీ థియేటర్లు ఓపెన్ చేస్తున్నారు. అలా ఇప్పటికే తెలంగాణాలో కూడా థియేటర్స్ ఓపెన్ చెయ్యడానికి అనుమతులు ఇచ్చారు. మరి అలాగే ఇప్పుడు ఏపీలో థియేటర్స్ ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

తాజా టాక్ ప్రకారం ఈ జూలై నెల మూడో వారం నుంచి సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వడానికి రెడీ సిద్ధంగా ఉన్నాయట. ఇప్పటికే చాలా కాలం థియేటర్స్ మూత పడడంతో అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. మరి ఇక నుంచి మళ్ళీ హంగామా షురూ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :