రాశి ఖన్నాకి ఫ్యాన్స్ ఉన్నారని తెలిసింది అప్పుడేనట..!

Published on Feb 14, 2020 10:07 am IST

రాశి ఖన్నా హీరోయిన్ గా గత ఏడాది వరుసగా రెండు విజయాలు అందుకుంది. ఆమె నటించిన వెంకీ మామ హిట్ కాగా, ప్రతిరోజు పండుగే సూపర్ హిట్ గా నిలిచింది. ఇక 2020లో ఆమె నటించిన మొదటి సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ నేడు విడుదల అవుతుంది. ఈ చిత్రంలో రాశి తన గత చిత్రాలకు భిన్నంగా కొంచెం బోల్డ్ రోల్ చేశారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో విజయ్ తో ఆమెకు ఉన్న ఇంటిమసీ సీన్స్ చూశాక ఆమె ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారు.

ఇదే విషయంపై రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ టీజర్ విడుదల తరువాత నా పాత్ర లోని ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ చూడకుండా అందరూ ఆ బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్ పెట్టారు. ఏంటి రాశి ఇలా చేసింది అన్నారు. అప్పుడే నాకు అర్థమైంది నన్ను ఇంతలా ఫాలో అయ్యే ఫ్యాన్స్ నాకు ఉన్నారా అనిపించింది. నేను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గమనించే అభిమానులు నాకున్నారన్న విషయం నాకు అప్పుడే అర్థం అయ్యింది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :