ఈ ముగ్గురు హీరోలు కలిసి చేస్తున్న సినిమా వైవిధ్యమైనది !

Published on Jul 16, 2018 1:17 pm IST

నూతన దర్శకుడు ఇంద్రసేనా దర్శకత్వంలో నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణుల కాంబినేషన్ లో ‘వీర‌భోగ వ‌సంత‌రాయులు’ చిత్రం తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వీరితో పాటు సీనియర్ హీరోయిన్ శ్రీయా కూడా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఓ వైవిధ్యమైన కథతో ఓ సైంటిఫిక్ సినిమాగా తెరకెక్కతుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో చాలా భాగం సోషియో ఫాంట‌సీ నేపథ్యంలో సాగుతుందట.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శ్రీ‌విష్ణు గ్రహాంత‌ర వాసిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దుష్ట శిక్షణ చేయడానికి దేవుడు అవతారాలు ఎత్తుతాడని పురాణాల్లో ఇతిహాసాల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కథాంశం ఆధారంగానే ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ‌ విష్ణు ఈ చిత్రంలో కొత్తగా కనిపించబోతున్నాడని, తెలుగులో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వైవిధ్యమైన చిత్రం రాలేదని చిత్రబృందం చెబుతుంది. బాబా క్రియేషన్స్ పతాకం ఫై బెల్లన అప్పారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :