“రాధే శ్యామ్” రిలీజ్..అలా ఛాన్సే లేదా.?

Published on May 2, 2021 9:41 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆల్ మోస్ట్ షూట్ కంప్లీట్ అయ్యిపోయిన ఈ చిత్రంలో కొంతమేర బ్యాలన్స్ రీషూట్ ఉంది. అది కూడా తొందరలోనే అయ్యిపోనుంది.

అయితే ఈ షూట్ అనంతరం ఈ చిత్రం విడుదల అనుకున్న సమయానికే వస్తుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇక ఈలోపే కొన్ని రూమర్స్ ఈ చిత్రంపై స్టార్ట్ అయ్యిపోయాయి. బాలీవుడ్ సినిమాలు వస్తున్న ఫార్మాట్ లో అంటే థియేటర్స్ సహా పే పర్ వ్యూ లా ఈ సినిమా వస్తుంది అని గాసిప్ మొదలయ్యింది.

అయితే ఈ రకంగా రిలీజ్ ఛాన్స్ లేదని తెలుస్తుంది. కాస్త లేట్ అయినా థియేట్రికల్ రిలీజ్ కే మేకర్స్ స్టిక్ అవుతారు తప్పితే ఆ ఫార్మాట్ రిలీజ్ అనేది కష్టమే అన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా రాధే శ్యామ్ మేకర్స్ దృష్టిలో కూడా అలాంటి ఆలోచనే ఇంకా లేనట్టు టాక్.

సంబంధిత సమాచారం :