“రాధే శ్యామ్” కు ఈ అంశంపై క్లారిటీ ఎప్పుడు?

Published on Sep 16, 2020 5:40 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. పీరియాడిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలను దర్శకుడు అలా మైంటైన్ చేస్తూ తీసుకొస్తున్నాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి చిత్ర యూనిట్ గత కొన్ని రోజుల నుంచి ఎప్పటికప్పుడు ఏదొక అంశాన్ని చెపుతున్నారు కానీ అసలైన అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు.ఈ చిత్రం మరోసారి షూట్ కు సిద్ధం అవుతుంది కానీ ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తున్నారు అన్నదానిపై ఎక్కడా క్లారిటీ లేదు.

ఆ మధ్య సాహో కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన జిబ్రానే ఈ సినిమాకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తారని టాక్ వినిపించింది కానీ దానిపై కూడా క్లారిటీ లేదు ఇప్పటికీ రాలేదు. దీనితో ఈ అంశంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More