“వకీల్ సాబ్”కు సరైన ప్రమోషన్స్ జరగడం లేదా.?

Published on Mar 18, 2021 7:05 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన హ్యాట్రిక్ అండ్ లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. అయితే మన నేటివిటీకి ముఖ్యంగా పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా చాలా మార్పులు చేసినట్టుగా ఇప్పటికే అర్ధం అవుతుంది.

సరే అంతా బాగున్నా పవన్ కం బ్యాక్ చిత్రం అయినటువంటి దీనికి ఎలా చూసుకున్నా సరైన ప్రమోషన్స్ జరగడం లేదని అభిమానుల్లో ఉన్న టాక్. అలాగే ఒకింత వాస్తవం అని కూడా చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ప్రస్తుత రోజుల్లో సరైన ప్రమోషన్స్ లేకపోతే జనంలోకి వెళ్లని పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైం లో వకీల్ సాబ్ కు అప్డేట్లే సరిగ్గా వస్తున్నట్టు అనిపించట్లేదు.

తాము విడుదల చేస్తున్న పాటల కోసమే సడెన్ సడెన్ గా అప్డేట్స్ వేస్తున్నారు తప్పితే వాటిపై అలర్ట్స్ లాంటివి కనిపించడమే లేదు. దీనితో ఈ సినిమాకు సగం హైప్ ఇక్కడే తగ్గుతుంది అని అభిమానులే అంటున్నారు. మరి మేకర్స్ మున్ముందు ఎలాంటి ప్లానింగ్స్ వేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు మరియు శిరీష్ లు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :