ప్రభాస్ పై వస్తున్న ఆ వార్తలన్నీ పుకార్లేనట..!

Published on Dec 27, 2019 11:07 pm IST

ప్రభాస్ నటిస్తున్న జాన్ మూవీ షూటింగ్ ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ చిత్ర షూటింగ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యూరప్ నేపథ్యంలో నడిచే పీరియాడిక్ లవ్ స్టోరీ అని ప్రభాస్ గతంలో చెప్పారు. బ్యూటీ పూజ హెగ్డే మొదటిసారి ప్రభాస్ సరసన నటిస్తున్నారు. కాగా జాన్ మూవీ తరువాత ప్రభాస్ చేసే మూవీపై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.

ఈ ఏడాది అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించి బంపర్ హిట్ అందుకున్నదర్శకుడు సందీప్ రెడ్డి వంగ హిందీలో డెవిల్ అనే మరో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ డెవిల్ మూవీలో హీరోగా చేయడానికి ప్రభాస్‌ను కలిశాడని, కథను విన్న డార్లింగ్ అందులో నటించేందుకు ఒప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రచారాలలో ఎటువంటి నిజం లేదట. ప్రస్తుతం జాన్ మూవీ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్, ఇంతవరకు కొత్త స్క్రిప్ట్‌లు ఏవీ వినలేదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :