శంకర్ సినిమాలో చరణ్ రోల్ పై ఈ గాసిప్స్ లో నిజం లేదు.!

Published on May 24, 2022 9:56 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా దర్శకుడు రాజమౌళితో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ ని “రౌద్రం రణం రుధిరం” చిత్రంతో అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని ఎదురు చూసిన వారికి మరో ఇండియాస్ టాప్ దర్శకుడు శంకర్ తో సినిమా అనౌన్స్ చేసి సెన్సేషన్ ని నమోదు చేసాడు.

ఇక ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ మేకోవర్ పై గత కొన్ని రోజులు కొన్ని రోజులు నుంచి మంచి చర్చ నడుస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ఈ సినిమాలో ఏకంగా రామ్ చరణ్ మూడు పాత్రలు చేస్తున్నాడని క్రేజీ గాసిప్ బయటకు వచ్చింది.

ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరో రెండు ట్విన్స్ అట. అయితే ఈ వార్తల్లో ఎలాంటినిజం లేదని అంతర్గత సమాచారం. చరణ్ కేవలం రెండు పాత్రల్లో మాత్రం కనిపిస్తాడని మూడు రోల్స్ చెయ్యడం లేదని వినికిడి. మరి ఆ గాసిప్స్ లో అయితే ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :