నయనతారకు కరోనా.. అసలు నిజం అదే..!

నయనతారకు కరోనా.. అసలు నిజం అదే..!

Published on Jun 21, 2020 6:49 PM IST

Nayanatara1

ఓ ప్రముఖ డైలీ… హీరోయిన్ నయనతార మరియు ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ కి కరోనా పాజిటివ్ అని తేలిందని..వారిద్దరు కోవిడ్ 19 భారిన పడ్డారని ప్రచురించడం జరిగింది. దీనితో ఒక్కసారిగా కలలం రేగింది. నయనతార ఫ్యాన్స్ ఆమె ఆరోగ్యం పట్ల దిగులు చెందారు. తమిళ చిత్ర వర్గాలు సైతం ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఐతే ఈ విషయంలో ఎటువంటి నిజం లేదని ఈ కపుల్ తెలియజేశారు.

తమకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని వారు తేల్చివేశారు. మేము సంపూర్ణ ఆరోగ్యముగా ఉన్నామన్నా ఈ జంట.. ఇలాంటి నిరాధారమైన వార్తలు నమ్మవద్దు అని ఫ్యాన్స్ ని కోరారు. ఇక త్వరలో నయనతార మరియు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుందట.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు