రాజమౌళి పై వస్తున్న ఆ వార్తలలో నిజమెంత?

Published on Feb 18, 2020 10:04 am IST

గత వారం రోజులుగా రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ న్యూస్ ప్రచారం అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి మరో మల్టీ స్టారర్ చేస్తున్నారని, అందులో ప్రభాస్ మరియు మహేష్ నటిస్తున్నారని అనేక మాధ్యమాలలో ప్రచురించడం జరిగింది. ఐతే ఈ రూమర్ లో అసలు వాస్తవం ఉండే అవకాశమే లేదు. దానికి కారణం రాజమౌళి ఎప్పుడూ రెండు మూడు సినిమా ప్రాజెక్ట్స్, స్క్రిప్ట్స్ సిద్ధంగా పెట్టుకొని ఉండరు. ఓ సినిమా పూర్తియిన అనంతరం మరో ప్రాజెక్ట్ సంబంధించి కథ సిద్ధం చేసుకోవడం, కథకు తగ్గట్టుగా క్యాస్ట్ అండ్ క్రూ ని ఎంచుకోవడం చేస్తారు. నెక్స్ట్ ఈ హీరోతో చేయాలి దానికోసం కథ కావాలని అనే పంథా ఆయనలో ఉండదు.

కాబట్టి రాజమౌళి ప్రభాస్ మరియు మహేష్ లతో మల్టీ స్టారర్ చేస్తున్నాడంటూ వస్తున్న వార్తలలో నిజం లేదు. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఒక సారి సినిమా విడుదల వాయిదా వేసిన తరుణంలో ఈ సారైనా చెప్పిన తేదీకి రావాలని పక్కా ప్లానింగ్ తో సిద్ధం అవుతున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ బాహుబలి ప్రీ రిలీజ్ బిసినెస్ ని కూడా దాటివేసిందని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ 2021 జనవరి 8న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More