లేటెస్ట్..”RRR” పై ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదు.!

Published on Jul 22, 2021 7:59 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళితో భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్ నిమిత్తం ఈ చిత్రపు మెయిన్ క్యాస్ట్ అంతా కూడా రంగంలోకి దిగారు.

అలాగే ఇప్పటికే హైదరాబాద్ లో రెండు భారీ సెట్టింగులలో ఆ ప్రమోషనల్ సాంగ్ ను ప్లాన్ చేసారు. అయితే ఈ సాంగ్ కి గాను రాజమౌళి లాస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి స్టార్స్ ప్రభాస్, రానా దగ్గుబాటి లు కూడా కనిపిస్తారని టాక్ ఊపందుకుంది. అలాగే వీరితో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా పాల్గొంటాడని ఆసక్తికర టాక్ వినిపించింది.

అయితే ఈ ముగ్గురు స్టార్స్ కూడా ఇతర “RRR” స్టార్స్ తో కలిపి కనిపిస్తారని తెలిసింది. కానీ ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. బాహుబలి స్టార్స్ ఏమో కానీ రవితేజ అయితే ఖచ్చితంగా లేరని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. అలాగే ఈ ప్రమోషనల్ సాంగ్ ఫ్రెండ్షిప్ డే కానుకగా విడుదల కానుంది అని టాక్ ఉంది.

సంబంధిత సమాచారం :