మా ‘టిల్లు స్క్వేర్’ లో చాలా థ్రిల్స్, షాక్ లు, సర్ ప్రైజ్ లు ఉంటాయి – హీరో సిద్దు జొన్నలగడ్డ

మా ‘టిల్లు స్క్వేర్’ లో చాలా థ్రిల్స్, షాక్ లు, సర్ ప్రైజ్ లు ఉంటాయి – హీరో సిద్దు జొన్నలగడ్డ

Published on Mar 27, 2024 11:14 PM IST

సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్లో నిర్మించగా రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. నేడు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా హైదరాబాద్ లోని ఐటిసి కోహినూర్ లో జరిగింది. ఈ సందర్భంగా హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, డీజే టిల్లు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది టైటిల్ సాంగ్. ఈ పాట కోసం రామ్ మిరియాల గారిని ఆఫీస్ కి పిలిపించాము. పారితోషికం గురించి మాట్లాడుతుంటే అప్పుడు ఆయన డబ్బులు గురించి తర్వాత చూద్దాం ముందు పాట బాగా రావాలి అన్నారు. సినీ పరిశ్రమలో ఇలా ఉండేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. రామ్ మిరియాలను కలిసిన ప్రతిసారీ ఒక మాట అంటాను. అదేంటంటే నువ్వు పాడినప్పుడు నీ గొంతులో మట్టివాసన ఉంటుంది. అలానే సాంగ్స్ లో ఎంతో రియాలిటీ ఉంటుందని చెప్పాను. అలానే అంతే అద్భుతంగా రాసిన కాసర్ల శ్యామ్ గారికి ధన్యవాదాలు.

అద్భుతంగా పాటని పాడిన గాయకుడు శ్రీరామ్ గారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మా మార్కస్, లడ్డు గురించి చెప్పాలి. ఈ జర్నీలో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ సినిమాలో వారి పాత్రలు చాలా బాగుంటాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. నా తల్లిదండ్రుల పాత్రలు పోషించిన మురళీధర్ గారు, సుజాత గారు, మిగతా నటీనటులకు థాంక్స్. డీజే టిల్లు అనేది యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. కానీ సినిమా విడుదలైన తర్వాత కుటుంబ ప్రేక్షకులకు, అందునా ముఖ్యంగా ఆడవాళ్లకు, చిన్న పిల్లలకు టిల్లు పాత్ర బాగా నచ్చడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. టిల్లు పాత్రని ప్రేక్షకులు హృదయాల్లో పెట్టుకున్నారు. నన్ను సిద్ధు కంటే కూడా ఎక్కువగా టిల్లు అనే పిలుస్తున్నారు. బయట ఎక్కడైనా కనిపిస్తే టిల్లు అన్న అంటూ ప్రేమగా పిలుస్తుంటారు. అందుకే సీక్వెల్ అంటే మొదట కాస్త భయపడ్డాను. కానీ ఒక్కటే అనుకున్నాను.

మొదటి పార్ట్ లా ఉండకూడదు, కానీ అదే స్థాయిలో వినోదాన్ని పంచాలి. అలాగే టిల్లు పాత్రలో ఉన్న సోల్ మిస్ అవ్వకూడదు. హీరోయిన్ పాత్ర కూడా మొదటి పార్ట్ లాగే బాగా ఫేమస్ అవ్వాలి. ఇలా అన్నీ దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాము. అయినా మొదట కాస్త భయపడ్డాము. యుద్ధం గెలుస్తామో లేదో మన చేతుల్లో ఉండదు. కానీ పోరాటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అది నమ్మే మా టీం అంతా టిల్లు స్క్వేర్ కోసం శాయశక్తులా కృషి చేశాం. ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్నాక మాకు సంతృప్తి కలిగింది. మొదటి పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి. మార్చి 29న థియేటర్లకు రండి, ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అలాగే ఈ సినిమా విషయంలో నేను కొందరికి థాంక్స్ చెప్పాలి. ముందుగా మ్యాడ్ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. నేను, కళ్యాణ్, ఆంథోనీ, మల్లిక్ కలిసి ఈ సినిమా రాశాము. కళ్యాణ్ మాకు చాలా హెల్ప్ చేశాడు.

అలాగే ఎడిటర్ నవీన్ నూలి గారికి, డీటీఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. అందరికంటే ముఖ్యంగా మా నిర్మాత నాగవంశీ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మాకు అండగా నిలిచిన చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి చాలా చాలా థాంక్స్. సినిమా కొన్నిసార్లు మాకు అర్థమైన దానికంటే త్రివిక్రమ్ గారికి ఎక్కువ అర్థమై మాకు ఎంతో సాయం చేశారు. భీమ్స్ సిసిరోలియో గారి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. టిల్లు లో మాస్ ని తన సంగీతంతో ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు. మార్చి 29న థియేటర్లలో చాలా చాలా నవ్వబోతున్నారు. చాలా థ్రిల్స్, షాక్ లు, సర్ ప్రైజ్ లు ఉంటాయి. మాస్ క్లైమాక్స్ ని చూడబోతున్నారు. టిల్లు స్క్వేర్ మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. తాజాగా నేను, అనుపమ కలిసున్న పోస్టర్ విడుదల చేసినప్పుడు కొందరు నెగటివ్ కామెంట్స్ రాశారు. అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు