బిగ్ బాస్ 4 – ఈ ఇద్దరికి మరింత పెరిగిన గ్రాఫ్.?

Published on Dec 4, 2020 6:37 pm IST

ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు చేరుకుంది. ఇంకో రెండు వారాల్లో పూర్తి కానున్న ఈ గ్రాండ్ షోలో మిగిలి ఉన్న కంటెస్టెంట్స్ లో టాప్ 5లో ఎవరుంటారో అన్నది కూడా వీక్షకులకు క్లారిటీ ఉంది. మరి అలాంటి వారిలో ఓ ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం నిన్నటి టాస్క్ తో మరింత స్ట్రాంగ్ గా మారారని చెప్పాలి.

వారు మరెవరో కాదు అఖిల్ మరియు షోయెల్ లే. నిన్న బిగ్ బాస్ ఉయ్యాల టాస్క్ విషయంలో వీరిద్దరి కమిట్మెంట్ ను చూసి వీక్షకులు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అలా ఒక్క రోజు అంతా కేవలం ఓకే ఊయల పై ఉండటం చిన్న విషయం కాదని చెప్పాలి. అర్ధ రాత్రి వరకు కూడా దాని మీద నుంచి లేవకుండా ఉండి ఈరోజు ఎపిసోడ్ లో అభిజీత్ తో ఎమోషనల్ అయ్యినప్పుడు నించున్నారు.

అది పగలు అయ్యిపోయినట్టు కనిపిస్తుంది అంటే దానిపైనే అలా అప్పటి వరకు ఉండిపోయినట్టే అయితే మామూలు టాస్కులు అంటే అటు ఇటు తిరగడమో లేక ఏదోకటి ఉంటుంది కానీ ఇలా ఒకే దగ్గర కూర్చొని ఉండడం అనేది కాస్త భిన్నమైంది ఈ విషయంలో మాత్రం వీరిద్దరి పట్టుదల వారిపై మరింత గౌరవాన్ని తెచ్చి పెట్టడమే కాకుండా వీక్షకుల్లో మరింత గ్రాఫ్ ను పెంచినట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం :

More