పవన్ ఆరోగ్యంపై క్లారిటీ కోరుకుంటున్నారు.!

Published on Apr 21, 2021 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనితో ఆందోళనలో పడిన పవన్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కోలుకోవాలని పూజలు యాగాలు కూడా జరిపించారు. అయితే పవన్ త్వరగా కోలుకోవాలని గట్టి సంకల్పం పెట్టుకున్నవారి కోరిక త్వరగానే నెరవేరి పవన్ కు కరోనా నెగిటివ్ వచ్చింది అని నిన్నటి నుంచి టాక్ నడుస్తుంది.

అంతర్గత సమాచారం ప్రకారం పవన్ కు నిన్ననే కరోనా నెగిటివ్ వచ్చేసింది అని పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూనే మరోపక్క కాస్త అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనితో పవన్ ఆరోగ్యం పట్ల ఒక సరైన క్లారిటీ కోరుకుంటున్నటున్నారు. ఇది వరకు విడుదల చేసిన అధికారిక ప్రెస్ నోట్స్ లానే నెగిటివ్ వచ్చింది అని కూడా ఓ ప్రెస్ నోట్ విడుదల చేసేస్తే ఉన్న చిన్న అనుమానం కూడా కూడా పోతుంది కదా అని వారి అభిప్రాయం. మరి పవన్ ఆరోగ్యంపై సరైన క్లారిటీ వదులుతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :