సాయిధరమ్ తేజ్ ‘తిక్క’కి హైలైట్‌గా నిలిచే అంశమిదే!
Published on Aug 10, 2016 7:23 pm IST

sai
వరుస విజయాలతో జోరు మీద ఉన్న మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్, తన కొత్త సినిమా ‘తిక్క’ను కూడా అప్పుడే విడుదలకు సిద్ధం చేసేశారు. ఈ శనివారం (ఆగష్టు 13న) విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇప్పటికే తారాస్థాయికి చేరిపోయాయి. సాయిధరమ్ తేజ్ స్వయంగా అభిమానులను, పత్రికలను కలుస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ సందర్భంగానే టీమ్ చెప్తోన్న అంశాలను బట్టిచూస్తే తిక్కకి కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

బ్రేకప్ చుట్టూ తిరిగే కథ కావడంతో యువత ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారని, ఈతరం ప్రేమలను కొత్తదనమున్న కథ, కథనాలతో పరిచయం చేయనున్న సినిమాగా తిక్క నిలుస్తుందని టీమ్ చెబుతోంది. ఇక ఈ బ్రేకప్ అంశం చుట్టూ పుట్టే కామెడీయే ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సాయిధరమ్ తేజ్ టీమ్ చెబుతోంది. ‘ఓం’ ఫేం సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రోహిణ్ రెడ్డి నిర్మించారు. థమన్ అందించిన ఆడియో ఇప్పటికే సూపర్ క్లిక్ అయిన ఈ సినిమాలో లారిస్సా బొనెస్సి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించారు.

 
Like us on Facebook