ఇష్క్, తిమ్మరుసు ల యూ ఎస్ కలెక్షన్లు ఎంతంటే?

Published on Aug 1, 2021 11:45 pm IST


కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు విడుదల కావడం తో ప్రేక్షకులు థియేటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే యూ ఎస్ లో సైతం మన తెలుగు సినిమాలు ప్రదర్శిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తిమ్మరుసు చిత్రం మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువగా వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు 18,411 డాలర్లు, రెండవ రోజు 18,479 డాలర్లు సాధించింది. అయితే మొత్తం 27.4 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

అదే తరహాలో ఇష్క్ మొదటి రోజు 1,895 డాలర్ లను వసూలు చేయగా, రెండవ రోజు 154 డాలర్ లని వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 1.5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలు త్వరలో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత సమాచారం :