ఐఎండీబీ రేటింగ్స్ లో ట్రెండ్ అవుతున్న తిమ్మరుసు!

Published on Jul 28, 2021 11:46 am IST


సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తిమ్మరుసు. ఈ చిత్రం విడుదల కి సిద్దం అయింది. జులై 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ఐఎండీబీ రేటింగ్స్ లో దూసుకు పోతుంది. మొత్తం మీదట టాప్ 10 లో తిమ్మరసు 8 వ స్థానం లో ఉండటం గమనార్హం. అయితే ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సైతం ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల అందిస్తున్నారు. శరణ్ కొప్పి శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో సత్యదేవ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం :