‘తిమ్మరుసు’ తో పాటు అన్ని సినిమాలు థియేటర్స్ లోనే మనం చూడాలి – నాని

‘తిమ్మరుసు’ తో పాటు అన్ని సినిమాలు థియేటర్స్ లోనే మనం చూడాలి – నాని

Published on Jul 28, 2021 2:50 PM IST

అసలు ఎవరూ ఊహించని కరోనా మూలాన ఇప్పటికే జరగాల్సిన తీవ్ర నష్టం ప్రతీ ఒక్కరికీ జరిగిపోయింది. ముఖ్యంగా అయితే సినీ పరిశ్రమకి దానినే నమ్ముకున్న థియేటర్స్ యజమాన్యంకే చాలా నష్టం జరిగింది. దీనితో మళ్ళీ ఎట్టకేలకు ఎలాగో థియేటర్స్ లో సినిమాలు విడుదల అయ్యేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ఒక్కొక్కటిగా విడుదలకు తమ సినిమాలు రెడీ చేస్తున్నారు.

మరి వాటిలో టాలెంట్ యాక్టింగ్ హౌస్ సత్యదేవ్ హీరోగా ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించిన చిత్రం “తిమ్మరుసు” కూడా రిలీజ్ కి రెడీ అయ్యింది. మరి నిన్ననే నాచురల్ స్టార్ నాని అతిధిగా గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను కూడా జరుపుకుంది. ఈ వేడుకలో నాని సహా హీరో దర్శక నటులు చేసిన పలు కామెంట్స్ హైలైట్ అయ్యాయి.

నాని మాట్లాడుతూ సత్యదేవ్ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య కానీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు తాను కూడా స్టార్ అయ్యిపోయి ఉండేవాడు అని సరే అది తిమ్మరసుతో రాసి పెట్టి ఉందేమో అని వ్యాఖ్యానించారు. అలాగే కరోనా ప్యాండమిక్ పై దాని వల్ల సినిమా పరిశ్రమ ముఖ్యంగా థియేటర్స్ ఎదుర్కొన్న కష్టాలపై కూడా నాని ఎన్నో వాస్తవిక కామెంట్స్ చేశారు. మని జీవితంలో థియేటర్స్ ఎంతో భాగం అయ్యాయి అందులో ఉండే ఎంజాయ్మెంట్ నే వేరేగా ఉంటుంది..

ఈ థర్డ్ వేవ్ తొక్కలో వేవ్ రాకుండా అందరం జాగ్రత్తగా ఉందాం సినిమా థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేద్దాం అని తెలిపారు. అలాగే ఒక్క తిమ్మరుసు సినిమానే కాదు తనది టక్ జగదీష్, రానున్న లవ్ స్టోరీ, ‘RRR” వరకు కూడా ప్రతి సినిమాని థియేటర్స్ లోనే చూసి మనం ఎంజాయ్ చేద్దామని ఈ సినిమా హిట్టయ్యే మిగతా సినిమాలు అన్నిటికీ ఆక్సిజన్ అందించాలని కోరుకుంటూ తాను కూడా ఏఈ చిత్రాన్ని వచ్చే 30 ను కుటుంబంతో కలిసి చూస్తానని తెలిపారు.

అలాగే సత్యదేవ్ నాని కోసం మాట్లాడుతూ నాని అన్న అంటే తనకి చాలా ఇష్టం అని తాను ఇండస్ట్రీలోకి ఎలా చెప్పి గుర్తు చేసుకున్నాడు అలాగే తన మొదటి అఫీషియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కావడంతో మరింత సంతోషం వ్యక్తం చేసాడు. అలాగే దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తాను ఈ సినిమా చేయడానికి అనుకున్నపుడు నిర్మాత మహేష్ కూడా కూడా యాడ్ అవ్వడం మంచి వెయిట్ వచ్చింది అనుకున్నానని అలాగే సత్యదేవ్ తో వర్క్ కూడా చాలా సరదాగా ఉందని తెలిపాడు.

అలాగే లాక్ డౌన్ తర్వాత రిలీజ్ కాబోతున్న తమ సినిమాని ప్రతి జాగ్రత్తగా చూసి ఎంజాయ్ చెయ్యాలని ఆకాంక్షించారు. అలాగే బ్రహ్మాజీ, ప్రియాంకా మాట్లాడుతూ నాని, సత్యదేవ్ లు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఎత్తుకి ఎదుగుతారని తాను మంచి రోల్ ఈ సినిమాలో చేసానని బ్రహ్మాజీ తెలిపారు. అలాగే ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్ లో చాలా తర్వాత ఫినిష్ చేశామని సత్యదేవ్ నటన చూసి తాను కూడా చాలా నేర్చుకున్నానని తాను కూడా తెలిపింది. మరి మంచి హైప్ తో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు