మ్యాడ్ హౌస్ లోకి ఎంటరైన మెగా డాటర్

Published on Nov 16, 2019 2:00 am IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై 100 ఎపిసోడ్స్ తో మ్యాడ్ హౌస్ అని ఒక వెబ్ సిరీస్ ఆమె నిర్వహిస్తున్నారు. యంగ్ బ్యాచిలర్స్ అయిన ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల మధ్య నడిచే రొమాంటిక్ కామెడీగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కినది. ఇప్పటికే మ్యాడ్ హౌస్ నుండి రెండు ఎపిసోడ్స్ విడుదల కాగా రెండూ, విశేష ఆదరణ దక్కించుకున్నాయి.

నేడు సాయంత్రం ఈ సిరీస్ లోని మూడవ ఎపిసోడ్ విడుదల కానుంది. కాగా ఈ ఎపిసోడ్ లో నిహారిక ఎంటర్ కానుందట. ఈ బ్యాచిలర్స్ ఉండే హౌస్ ఓనర్ గా వారితో ఓ ఆట ఆడుకోనుందట. ఈ మెగా ఫ్యామిలీ అమ్మడు నటిగా సినిమాలలో నటిస్తూనే ఇలా నిర్మాతగా వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల నిహారిక సైరా నరసింహ రెడ్డి మూవీలో ఓ పాత్ర చేశారు.

సంబంధిత సమాచారం :