సుశాంత్ సింగ్ పై ఇదంతా సానుభూతి మాత్రమే..!

Published on Jul 10, 2020 11:59 pm IST

ఈ ఏడాది బాలీవుడ్ లో ఎన్నో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాటిలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం ప్రతీ ఒక్కరినీ మరింత బాధించింది. ఇప్పటికే పెద్ద మిస్టరీగా నడుస్తున్న ఈ సెన్సిటివ్ అంశం ఏ విధంగా ముగుస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఈ లోపునే తాను నటించిన ఆఖరి చిత్రం “దిల్ బెచారా” ఇప్పుడు స్ట్రీమింగ్ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో దీనిని ప్రపంచంలోనే అత్యుత్తమ ట్రైలర్ గా మలచాలని నెటిజన్స్ ఫిక్స్ అయ్యి వరల్డ్ హైయెస్ట్ లైక్డ్ ట్రైలర్ గా మలిచారు.

ఇది బాగానే ఉంది సరే కానీ ఇదంతా దేనికి అతనిపై ఉన్న సానుభూతి తోనే కదా అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సుశాంత్ కు ఇప్పుడు ఏమీ కానట్టు ఉంటే ఈ ట్రైలర్ కు కనీసం 1 మిలియన్ లైక్స్ అయినా వచ్చి ఉండేవా? సో ఇదంతా అతనిపై చూపుతున్న సానుభూతే కదా అని న్యూట్రల్ ఫిల్మ్ లవర్స్ తమ నిజమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్ మరో అరుదైన రికార్డు 10 మిలియన్ లైక్స్ దిశగా వెళుతోంది.

సంబంధిత సమాచారం :

More