ఇక “బిగ్ బాస్” హౌస్ లో ఈ యాంగిల్ మిస్సయ్యినట్టే.!

Published on Dec 1, 2020 8:02 pm IST

ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 లాస్ట్ స్టేజ్ కు వస్తుండే సరికి మరింత ఆసక్తి కూడా పెరుగుతుంది. అయితే గత సీజన్లో టైటిల్ విన్నర్ రాహుల్ మరియు పునర్నవిల మధ్య జరిగిన కెమిస్ట్రీ ఎంత పెద్ద ఎసెట్ అయ్యిందో తెలిసిందే. అలా ఈసారి కూడా కొంతమంది జంటల నడుమ కూడా కెమిస్ట్రీ నడిచింది కానీ ఈసారి మాత్రం ఈ ఎలిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదని చెప్పాలి.

కెమిస్ట్రీ అయితే కొంతమంది మధ్య బానే ఉంది కానీ అది మరీ అంత స్థాయిలో పని చేయలేదు. ఇపుడు అలా చిన్న కెమిస్ట్రీ ఉన్న జంటలు కూడా లాస్ట్ నామినేషన్స్ ప్రక్రియతో తెగిపోయినట్టు అనిపించింది. హారిక అభిజీత్ ను నామినేట్ చెయ్యడం అలాగే మోనాల్ విషయంలో అఖిల్ కు కూడా మరోసారి చేదు అనుభవం ఎదురయ్యింది. ముఖ్యంగా హైలైట్ అయ్యే ఈ జంటలే ఇప్పుడు కాస్త దూరం అయ్యాయి. సో ఇక నుంచి ఈ రొమాంటిక్ యాంగిల్ బిగ్ బాస్ 4 లో మిస్సయ్యినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More