“ఆచార్య”లో చరణ్ కు ఫైనల్ అయిన ఈ బ్యూటీ.?

Published on Jan 23, 2021 9:59 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రెండు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో ఒకటి దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్న “రౌద్రం రణం రుధిరం” కాగా మరొకటి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మరియు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న భారీ చిత్రం “ఆచార్య”.

ఇప్పుడు ఈ రెండు సినిమాల పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఆచార్య లో మాత్రం చరణ్ కు సరసన చెయ్యబోయే ఫిమేల్ లీడ్ విషయంలో అయితే ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. మరి ఈ పాత్రకు గాను ఆ మధ్య స్టార్ హీరోయిన్స్ రష్మికా మందన్నా అలాగే పూజా హెగ్డేల పేర్లు వినిపించాయి.

కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ కీలక రోల్ కు పూజా హెగ్డే పేరు కన్ఫర్మ్ అయ్యినట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా వీరిద్దరికీ ఓ సాంగ్ కూడా ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక సమాచారం వచ్చే వరకు అయితే ఏది కన్ఫర్మ్ కాదు. వేచి చూడాలి మరి ఇది ఎంత వరకు నిజమో..

సంబంధిత సమాచారం :