కరోనా అనంతరం ఓ ప్రాజెక్ట్ చేయనున్న బ్లాక్ బస్టర్ నిర్మాత.!

Published on Jul 8, 2020 8:13 pm IST

ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ వచ్చింది అని వచ్చిన వార్తలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ నిర్మాత కరోనా ను జయించి సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకున్నారు. అయితే నిర్మాతగా బండ్ల ఓ సినిమా చేసి చాలా కాలమే అయ్యింది. దీనితో ఈ కరోనా సీజన్ అనంతరం నిర్మాత బండ్ల గణేష్ ఒక సినిమా చేయడానికి సంసిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా తాను కేవలం పెద్ద ప్రాజెక్టులను మాత్రమే కాకుండా కొత్తవారితో కూడా లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు తీస్తానని ప్రస్తావించారు. అలా ఇప్పుడు ఓ చిన్నపాటి కొత్త సినిమాను బండ్ల గణేష్ నిర్మించనున్నారని తెలుస్తుంది. తనకు సరైన కథ దొరికిన వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నారని ఇప్పుడు సమాచారం.

సంబంధిత సమాచారం :

More