బిగ్ బాస్ 4 – మెల్లగా టాప్ లోకి వచ్చేస్తున్న ఈ కంటెస్టెంట్.?

Published on Dec 1, 2020 10:00 pm IST

ఎంతో ఎంటర్టైనింగ్ గా కొనసాగుతున్న ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ స్టేజ్ కు వస్తుంది. దీనితో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పై ఉన్న ప్రమాణాలు కూడా ఆడియెన్స్ లో శరవేగంగా మారిపోతున్నాయి. దీనితో కొంతమంది కంటెస్టెంట్స్ తాలూకా గ్రాఫ్ లు కూడా మారుతున్నాయి.

అలా ఓ కంటెస్టెంట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో టాప్ కి వస్తున్నాడని తెలుస్తుంది అతడే షోయెల్. మొదట నుంచి పూర్తిగా అగ్రెసివ్ గా ఉన్న ఈ కంటెస్టెంట్ లో వచ్చిన సడెన్ ఛేంజే అందుకు ప్రధాన కారణం అన్నట్టు తెలుస్తుంది. నాగ్ కోపం తగ్గించుకోవాలని షోయెల్ కు సూచించిన దగ్గర నుంచి కూడా షోయెల్ అగ్రెసివ్ గా ఒకటే పంథాలో నడుచుకుంది లేదు.

చాలా వరకు మారిపోయాడు. తోటి కంటెస్టెంట్స్ తో ఎప్పుడు నవ్వుతు సింపుల్ గా పరిస్థితులను తీసుకొంటూ వస్తున్నాడు. ఓ రకంగా ఈసారి నామినేషన్స్ లో లేకపోవడానికి కారణం కూడా ఇదే అని చెప్పొచ్చు. అలా ఇప్పుడు షోయెల్ మెల్లగా టాప్ లోకి వచ్చేస్తున్నాడు. మరి ఫైనల్స్ లిస్ట్ లో షోయెల్ పేరు ఉంటుందా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :

More