బిగ్ బాస్ 5..ఈరోజు ఈ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్.!

Published on Oct 24, 2021 9:00 am IST

తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 గత సీజన్స్ లానే ఈసారి కూడా మంచి రసవత్తరంగా కొనసాగుతూ వెళ్తుంది. ఇంట్రెస్టింగ్ గేమ్స్ తో టాస్కులతో ఈ షో ఇప్పుడు సగానికి చేరుకుంది. ఇక సమయం గడిచే కొద్దీ హౌస్ లో కంటెస్టెంట్స్ కూడా తగ్గుతారన్న సంగతి తెలిసిందే. అలా ఈవారాంతం విషయానికి వస్తే ఓ ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది.

మొదటి నుంచి కూడా ఆడియెన్స్ లో మంచి పాజిటివ్ వైబ్స్ లోనే హౌస్ లోకి వెళ్లిన ఆ కంటెస్టెంట్ ప్రియా. ఈమెనే ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి వైదొలిగే మరో కంటెస్టెంట్ అని కన్ఫర్మ్ అయ్యింది. ఇన్ని రోజులు ఆమె గేమింగ్ అంతా బాగానే ఆకట్టుకున్నా ఓ స్టేజ్ వచ్చేసరికి అలా ఉండదుగా సో అలా ప్రియా కి బిగ్ బాస్ హౌస్ లో ఉండే అవకాశం వీక్షకులు కలిగించలేదు. మరి ఇకముందు నుంచి బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :