ఈరోజు ఎలిమినేషన్ తో బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లో పోటీ రాబోయే రోజుల్లో మరింత స్థాయిలో ఆసక్తికరంగా సాగనుంది. అయితే ఇప్పుడు ఎలాగో షో లాస్ట్ కి వచ్చేస్తుంది కాబట్టి టైటిల్ ఎవరు విన్నవుతారు అనే టఫ్ ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టఫ్ అని ఎందుకు వచ్చింది అంటే టాప్ స్థానాల్లో ఉన్న వారు ఎవరికీ ఎవరు తీసిపోరు వార్ వన్ సైడ్ చేద్దామన్నా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. అలా కొన్ని కీలక మార్పులతో ఓ కంటెస్టెంట్ టైటిల్ విన్నింగ్ కు గట్టి ఛాన్స్ లను కల్పించుకున్నాడని చెప్పాలి.
అతడే షోయెల్. ఇతడు మొదట్లో నెగిటివిటీనే తెచ్చుకున్న ఈ మధ్య తాను మార్చుకున్న యాటిట్యూడ్ తో మాత్రం మంచి ఆధరణనే రాబట్టుకున్నాడు. అలాగే ఇటీవలే అఖిల్ కోసం ఫైనల్స్ టికెట్ ను వదులుకోవడం అందరి కంటెస్టెంట్స్ తో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా సరదాగా ఉండడం వంటివి కామన్ ఆడియెన్స్ లో కూడా మరింత గుర్తింపుని ఇతడికి తీసుకొచ్చాయి. దీనితో ఇప్పుడు షోయెల్ కూడా అభిజీత్ మరియు అఖిల్ లకు గట్టి పోటీనే ఇవ్వడం ఖాయం అని చెప్పాలి.


