ఇప్పుడు మన తెలుగు సోషల్ మీడియా అంతా బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్స్ చర్చల తోనే నిండి ఉంది. మరి ప్రధానంగా వినిపించే ప్రశ్న ఏదో కూడా అందరికీ తెలిసిందే, అదే ఈసారి సీజన్ విన్నర్ ఎవరు అని. మరి ఈ విషయంలో టాప్ 5 లో ఉన్న అందరి పేర్లు వినిపిస్తున్నాయి కానీ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓ కంటెస్టెంట్ పేరు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది.
అదీ ఎంతలా అంటే ఇంకా ఈరోజు ఎపిసోడ్ పూర్తి కాకముందే విన్నర్ అతడే అని చాలా మంది ఫిక్స్ అయ్యారు. అతడు మరెవరో కాదు అభిజీతే. ఈ కంటెస్టెంట్ విషయంలో ప్రతీ అంశం యూనానిమస్ అయ్యిపోయింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీ రికార్డులను అభిజీత్ కు అతడి ఫాలోవర్స్ ఇచ్చారు.
అయితే అభిజీత్ తో సమానంగా మంచి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ పేర్లు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు వచ్చే సరికి డౌన్ అవ్వడం కాస్త ఆశ్చర్యకరంగా మారింది. ఒకానొక స్టేజ్ లో అయితే అఖిల్ కు మరియు అభిజీత్ కు ఓ రేంజ్ లో పోటీ నడిచేది కానీ ఇప్పుడు దాదాపు మ్యానియా అంతా అభిజీత్ వైపే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మరి విన్నర్ గా అభిజీత్ నిలుస్తాడా లేదా మరెవరన్నా నిలుస్తారా అన్నది చూడాలి.


