బిగ్ బాస్ 5 : ఈసారి ఎలిమినేషన్లో ఈ కంటెస్టెంట్ పేరు.?

Published on Nov 20, 2021 2:00 pm IST

మన తెలుగు అతి పెద్ద గ్ర్యాండ్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో ఐదవ సీజన్లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక అలాగే ప్రతీ వారాంతంలో కూడా ఎలిమినేషన్స్ ఉంటాయని కూడా అందరికీ తెలుసు. అలా ఈ వారాంతం ఎలిమినేషన్ పై లేటెస్ట్ ఇన్ఫో తెలుస్తుంది. ఈ వారం హౌస్ మేట్స్ లో ఒక్క రవి మినహా అంతా నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.

కానీ ఓ ఇద్దరు కంటెస్టెంట్స్ తక్కువ ఓట్స్ తో లాస్ట్ లో ఉన్నారట. వారే కాజల్ మరియు ఆనీ మాస్టర్. ఇక వీరిలో ఆనీ మాస్టర్ దాదాపు ఎలిమినేట్ కావచ్చట. మరి ఈ ఇద్దరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి వైదొలిగారో లేదో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. మరి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసే ఈ షో ఈ వీకెండ్స్ లో రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :

More