“బిగ్ బాస్ 15” నుంచి ఆరోగ్య సమస్యతో ఓ కంటెస్టెంట్ అవుట్!

Published on Nov 11, 2021 8:02 am IST

మన తెలుగులో ఎలా అయితే విజయవంతంగా గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 సీజన్లను రన్ చేసుకుంటూ వెళుతుందో మన లానే దేశ వ్యాప్తంగా కూడా అనేక భాషల్లో ఈ షో భారీ లెవెల్లో ప్రసారం జరుగుతుంది. అలాగే హిందీలో కూడా షో ఇప్పటి వరకు 14 సీజన్లను కంప్లీట్ చేసుకొని 15వ సీజన్ ని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే మన తెలుగు సీజన్ లో ఇటీవల ఓ కంటెస్టెంట్ కి హెల్త్ ఇస్స్యూస్ వచ్చాయని తెలిసిందే. కానీ హిందీ బిగ్ బాస్ లో రఖేష్ బాపట్ అనే కంటెస్టెంట్ కి కాస్త ఎక్కువ స్థాయిలోనే ఆరోగ్య సమస్య వచ్చిందట. తన కిడ్నీలో రాళ్లు ఉన్నాయని దాని వల్ల అతడు ఇబ్బందికి లోనయ్యాడట. అందుకే ఈ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి పంపించినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :