అనూహ్యంగా బిగ్ బాస్ ఫైనల్ కి ఆఒక్కడు వెళ్ళాడు

Published on Oct 23, 2019 8:12 am IST

నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో సంచలనం నమోదైంది. నాటకీయ పరిణామాల మధ్య అందరి అంచనాలను, ఊహలను తలకిందులు చేస్తూ రాహుల్ టిక్కెట్ టు ఫినాలే సంపాదించి, ఫైనల్ కు అర్హత సాధించాడు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న టాస్క్ లలో పాయింట్స్ ఆధారంగా ఒకరు నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉండగా రాహుల్ నెగ్గి తుది అంకానికి చేరుకున్నాడు. నిజానికి రాహుల్ కంటే అలీ రెజా కు పాయింట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ టాస్క్ లో విపరీత ప్రవర్తన ఆధారంగా తనని ఎంపిక చేయలేదు.

మొదట్నుండి అసలు ఫేవరెట్స్ లిస్ట్ లో లేని రాహుల్ ఫైనల్ కి చేరి అందరిని ఆశ్చర్య పరిచాడు. నిజానికి ప్రస్తుతం ఉన్న ఆరుగురు సభ్యులలో అధిక మార్లు ఎలిమినేషన్ కి నామినేట్ ఐయ్యింది రాహుల్ మాత్రమే. లీగ్ దశలో పడుతూ లేస్తూ విజయాలు సాధించిన టీం వరల్డ్ కప్ ఫైనల్ కి వెళ్లినట్టు రాహుల్ ఫైనల్ ఛాన్స్ కొట్టేశాడు. ఇక మిగిలిన వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, శివ జ్యోతి,అలీ రెజాలు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. ఎలిమినేట్ కాగా మిగిలిన వారిలో ఒకరు ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఫైనల్ కి వెళ్లి రాహుల్ తో పోటీపడతారు.

సంబంధిత సమాచారం :

More