కాంట్రవర్సియల్ స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.!

Published on May 8, 2021 10:57 am IST

మన తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తన మొదటి సినిమా చేసి ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కంగనా రనౌత్. అయితే కంగనా క్రమక్రమంగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంటూనే పలు కాంట్రవర్సీలతో మరింత సంచలనం రేపింది.

ఇటీవల కూడా ఆమె బెంగాల్ ఎన్నికల విషయంలో చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ వారు శాశ్వతంగా బ్యాన్ కూడా చేసారు. మరి ఇలా మారిన ఈ స్టార్ట్ హీరోయిన్ కూడా ఇప్పుడు కరోనా బారిన పడ్డట్టుగా బాలీవుడ్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఆమె కొన్ని రోజులు నుంచి అలసిపోయానని అందుకే హిమాచల్ వెళదామని అనుకున్నానని..

కానీ దానికి ముందు టెస్ట్ చేయించుకోగా ఈరోజు రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని కంగనా తెలిపింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టుగా తెలిపింది. అంతే కాకుండా ఈ వైరస్ తన శరీరంలో పార్టీ చేసుకుంటుందేమో అని ప్రజలు ఇలాంటి సమయంలో భయపడితే ఈ వైరస్ ఇంకా భయపెడుతుంది అని అందుకే ఈ చిన్న వైరస్ ను ప్రతి ఒక్కరూ నాశనం చెయ్యాలి అని కంగనా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. మరి కంగనా త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :