‘సరిలేరు నీకెవ్వరు’లో.. ఆ ఎపిసోడే హైలెట్ !

Published on Oct 23, 2019 12:32 am IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ఓ పెళ్లి ఎపిసోడ్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందట. ఈ ఎపిసోడ్ లోనే బండ్ల గణేష్ అండ్ వెన్నెల కిషోర్ మధ్య కొన్ని కామెడీ సీన్లు వస్తాయని.. ఆ సీన్స్ లో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుందని.. పైగా మహేష్ కూడా ఈ ఎపిసోడ్ లో ఫుల్ కామెడీ చేయబోతున్నాడని అందుకే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలెట్ గా అవుతుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More