ఈ శుక్రవారం థియేటర్లలో 7 సినిమాలు రిలీజ్.. ఏవేవంటే..!

Published on Aug 4, 2021 1:00 am IST

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఇప్పుడిప్పుడే కాస్త చక్కబడడంతో నాలుగు నెలల తర్వాత మొన్న జూలై 30న సినిమా థియేటర్లు తిరిగి తెరుచుకున్న సంగతి తెలిసిందే. గత వారం తిమ్మరుసు, ఇష్క్ వంటి సినిమాలతో కలిపి మొత్తం 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే గత వారంలో వచ్చిన సినిమాలు కలెక్షన్ల పరంగా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయానని తెలిసినా కూడా ఈ వారం సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు చాలా సినిమాలు క్యూ కట్టాయి.

అయితే ఆగష్టు 6 ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాలను చూసుకుంటే “SR కళ్యాణమండపం”, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, మెరిసే మెరిసే, క్షీర సాగ‌ర మ‌ధ‌నం, రావ‌ణ‌లంక వంటి సినిమాలున్నాయి. అయితే ఈ అరడజన్‌కి పైగా సినిమాల్లో కేవలం “SR కళ్యాణమండపం”పై మాత్రమే ఓ మోస్తారు అంచనాలు ఉన్నాయి. చూడాలి మరీ మిగతా సినిమాలు కూడా ఏమైనా మెప్పిస్తాయేమో.

సంబంధిత సమాచారం :