సోషల్ మెస్సేజ్ లతో సూపర్ హిట్స్ అందుకుంటున్న మహేష్

Published on Jan 21, 2020 7:19 am IST

మహేష్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు.ఆయన గత మూడు చిత్రాలు భరత్ అనే నేను, మహర్షి మరియు తాజాగా విడుదల అయిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన మెస్సేజ్ ఓరియంటెడ్ చిత్రాలు ఆయనకు విజయాలను కట్టబెట్టబెడుతున్నాయి. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఉన్న శ్రీమంతుడు ఓ మంచి సోషల్ మెస్సేజ్ తో తెరకెక్కి అద్భుత విజయాన్ని అందుకుంది.ముఖ్యంగా మహేష్ అటు మిలియనీర్ గా, పుట్టి పెరిగిన ఊరి పట్ల సామజిక బాధ్యత గలిగిన యుకుడిగా భిన్న షేడ్స్ లో నటించి మెప్పించారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రం వరకు మహేష్ గత చిత్రాల ట్రాక్ తీసుకుంటే, సోషల్ మెస్సేజ్ తో తెరకెక్కిన చిత్రాలు ఆయనకు మంచి విజయాలను కట్టబెట్టాయి. భరత్ అనే నేను, మహర్షి రెండు సోషల్ మెస్సేజ్ కలిగిన చిత్రాలే. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ డోసు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ.. దేశంపట్ల ఓ జవానుకు ఉండే బాధ్యత వంటి మెస్సేజ్ ని చక్కగా మహేష్ పాత్రలో చూపించారు. కాబట్టి మహేష్ కి సోషమ్ మెస్సేజ్ సినిమాలు మంచి విజయాలను కట్టబెడుతున్నాయి. ఇక సరిలేరు నీకెవ్వరు యూఎస్ లో $2.5 మిలియన్ వసూళ్ల వైపు దూసుకుపోతుండగా, తెలుగు రాష్ట్రాలలో 100కోట్ల షేర్ దాటివేసింది.

సంబంధిత సమాచారం :

X
More