మహేష్ సినిమాకి ఆమె కూడా ఫిక్సేనట.!?

Published on May 22, 2021 4:00 pm IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కూడా ఓ సినిమా ఫిక్స్ అయ్యింది. మరి ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర వార్తలు మొదటి నుంచీ వినిపించసాగాయి.

అయితే త్రివిక్రమ్ ప్రతి సినిమాలానే ఈ చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టనున్నారని టాక్ వచ్చింది. వారిలో మెయిన్ ఫిమేల్ లీడ్ గా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పేరు మళ్ళీ రేస్ లోకి రాగా మరో హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పేరు వినిపించింది. మరి ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం అది నిజమే అన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో రెండో మెయిన్ ఫిమేల్ లీడ్ గా జాన్వీ కపూర్ పేరు ఇంకా అండర్ లో ఉందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూఅడల్.

సంబంధిత సమాచారం :