థలపతి విజయ్ సినిమాకు ఈమె ఫిక్సేనట.!

Published on Mar 13, 2021 11:00 am IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్”. లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అటు తమిళ్ తో పాటుగా మన తెలుగులో కూడా అద్భుత వసూళ్లను రాబట్టుకుంది. మరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లోనే విడుదల చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక దీనితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కూడా పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసారు.

ఆ స్థాయికి తగ్గట్టుగానే దర్శకుడు నెల్సన్ దిలీప్ ప్రిపేర్ అయ్యారని తెలిసింది. అయితే గత కొన్నాళ్లుగా ఈ చిత్రానికి గాను హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది అని టాక్ ఉంది. అయితే ఇది ఫిక్స్ అయ్యిపోయిందట అంతే కాకుండా దీనిపై ఒక అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి కూడా అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :