భారీ హిట్ ఇచ్చినా.. హీరోలు హ్యాండ్ ఇస్తున్నారుగా !

Published on Mar 18, 2019 8:07 pm IST

“ఆర్ఎక్స్ 100” అనే బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు దర్శకుడు అజ‌య్ భూప‌తి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ షేర్‌ను రాబట్టుకుంది. దీంతో అజ‌య్ భూప‌తికి బాగానే ఆఫర్స్ వచ్చాయి. మొదట రామ్ హీరోగా భవ్య మూవీస్ లో సినిమా ఉంటుందన్నారు.. ఏమైందో ఏమో అది కాస్త క్యాన్సిల్ అయింది. ఈ లోపు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా ఉంటుందన్నారు.

ఆ మేరకు అజ‌య్ భూప‌తి స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు ‘మహాసముద్రం’ అని టైటిల్ పెట్టాలని.. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో సాగుతుందని వార్తలు కూడా వచ్చాయి. అంతలో ఏమైందో ఏమో.. ఈ కాంబినేషన్ కూడా సెట్ అవ్వలేదు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా…అలాగే ఓ నూతన దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ – అజ‌య్ భూప‌తి సినిమా క్యాన్సిల్ అయినట్లే తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More