ఆస్కార్ ఎంట్రీ సినిమాను ప్రభాస్ అలా మిస్సయ్యాడన్నమాట ?

ఆస్కార్ ఎంట్రీ సినిమాను ప్రభాస్ అలా మిస్సయ్యాడన్నమాట ?

Published on Dec 10, 2020 1:30 AM IST

Prabhas 6

‘బాహుబలి’ సినిమా తరవాత ప్రభాస్ స్టార్ డమ్ ప్రపంచవ్యాప్తమైంది. అన్ని దేశాల చిత్ర పరిశ్రమలకు ప్రభాస్ పేరు పరిచయమైంది. ఆయన ఫ్యాన్ బేస్ పెరిగింది. దాంతో పాటే ఆయనతో సినిమా చేయాలని చాలామంది దర్శకులు భావించారు. అలా భావించిన వారిలో దీప మెహతా కూడ ఒకరు. ఈమె ఇండో – కెనడియన్ డైరెక్టర్. అవార్డు సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్ లాంటి వారు. ఆమె చేసిన సినిమాలు కొన్ని ఆస్కార్ ఎంట్రీలోకి చోటు దక్కించుకున్నాయి. 1998లో ఆమె చేసిన ‘ఎర్త్’ చిత్రం ఇండియా తరపున ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ అయింది. 2005లో చేసిన ‘వాటర్’ చిత్రం కెనడా తరపున అకాడమీ అవార్డుల్లోకి ఎంట్రీ సాధించింది.

ఈ ఏడాది ఆమె చేసిన చిత్రం ‘ఫన్నీ బాయ్’. ప్రముఖ నవలా రచయితా శ్యామ్ సెల్వదురై రాసిన ‘ఫన్నీ బాయ్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారామె. ఇది శ్రీలంకలో ఉండే ఒక తమిళ కుర్రాడి కథ. స్వలింగసంపర్కం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం కెనడా తరపున 2021 ఆస్కార్ బరిలోకి ఎంట్రీ సాధించింది. అయితే ఒక తమిళ కుర్రాడి జీవితమైన ఈ కథలో తమిళ నటులెవరూ లేరనే ప్రశ్నలు ఆమెకు ఎదురయ్యాయి. దీప మెహతా దానికి సమధానం చెబుతూ దక్షిణాది నటుల్ని సినిమాలోకి తీసుకోవాలని చాలా ట్రై చేశానని చెప్పుకొచ్చారు.

మొదటగా స్టార్ నటుడు మాధవన్ ను సినిమాలో తండ్రి పాత్ర చేయమని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. మరొక నటుడు సిద్దార్థ్ ను తీసుకుందామని అనుకుంటే ఆ టైంలో ఆయనకు భుజం విరిగి ఉంది. ఇక ‘బాహుబలి’ చిత్రంలో బాహుబలిగా నటించిన నటుడ్ని చేయిద్దామని అనుకుని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాను. కానీ అతను దొరకలేదు. సో.. అలా జరిగిపోయింది. చివరకు అమెరికన్ నటుడు సెంథిల్ అమితాబ్ రామమూర్తితో చేశాను అంటూ చెప్పుకొచ్చారు. సో.. అలా మన ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం మూలాన ఆస్కార్ ఎంట్రీ సినిమాను మిస్సయ్యారన్నమాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు