కీర్తి సురేష్ కెరీర్ లోనే స్పెషల్ ఫిల్మ్ అట !

కీర్తి సురేష్ కెరీర్ లోనే స్పెషల్ ఫిల్మ్ అట !

Published on Mar 1, 2021 3:03 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో కీర్తి క్యారెక్టర్ చాల కొత్తగా ఉంటుందని.. ముఖ్యంగా ఆమె సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఈ సినిమాలో అద్భుతంగా వచ్చిందట.

హీరోయిన్ టీజింగ్ సీన్లతో మాంచి ఫన్ పండిందట. దర్శకుడు పరుశురామ్ లవ్ ట్రాక్ లను బాగా రాస్తాడనే పేరు ఉంది. ఏది ఏమైనా కీర్తి సురేష్ కెరీర్ లో ఈ సినిమా మరో స్పెషల్ సినిమాలా నిలిచిపోతుందట. పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో ఆర్ధిక రంగంలోని లొసుగుల వ్యవహరాలకు, సామాజిక అంశాన్ని జోడించి.. పక్కా కమర్షియల్ సినిమాగా ఈ సినిమా రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు