చోటా కె నాయుడు కామెంట్స్ పై హరీష్ శంకర్ రెస్పాన్స్ ఇదే

చోటా కె నాయుడు కామెంట్స్ పై హరీష్ శంకర్ రెస్పాన్స్ ఇదే

Published on Apr 20, 2024 6:33 PM IST

టాలీవుడ్ మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తొలిసారిగా రవితేజ, జ్యోతిక ల కాంబినేషన్ లో వచ్చిన షాక్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చా రు. ఆ తరువాత మరొక్కసారి రవితేజతో చేసిన మిరపకాయ్ ఆయనకు మంచి సక్సెస్ ఇచ్చింది. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఆ వెంటనే ఎన్టీఆర్ తో హరీష్ తీసిన రామయ్య వస్తావయ్యా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తాజాగా ఈ మూవీ విషయమై కెమెరా మ్యాన్ చోట కె నాయుడు మాట్లాడుతూ, రామయ్య వస్తావయ్యా కి వర్క్ చేసేటపుడు హరీష్ శంకర్ కొన్ని విషయాల్లో అస్తమానము అడ్డుపడుతుండేవాడు, ఎన్నిసార్లు నేను చెప్పడానికి ట్రై చేసినా వినే మూడ్ లో లేడు, అందుకే చివరికి తనకు ఏది కావాలో అదే విధంగా నేను పని చేశాను, ఎక్కువసార్లు అటువంటి వారితో వాదించను, నాకు కోపం కూడా ఎక్కువసేపు రాదు.

అందుకే తనకు నచ్చిన విధంగానే పనిచేయాల్సి వచ్చిందని అన్నారు. ఇక తాజగా ఆయన కామెంట్స్ పై దర్శకుడు హరీష్ శంకర్ ఒక ప్రెస్ నోట్ ద్వారా స్పందించారు. రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా, కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్లో షూటింగ్‌ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్‌ సింగ్‌ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ ని తీసేస్తున్నాడు అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే గబ్జర్‌ సింగ్‌ వచ్చినప్పుడు నాది రామయ్య వస్తావయ్య’ వస్తే అది నీది అనే క్యారెక్టర్‌ కాదు నాది.

మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా,నా ప్రస్తావన రాకున్నా , నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా, కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే ఏ రోజైన ఏ ప్లాట్ ఫామ్ లో అయినా నేను రెడీ అంటూ తన నోట్ లో తెలిపారు హరీష్. కాగా ప్రస్తుతం ఆయన ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు