మహేష్ బాబు మూవీపై ఆర్ ఆర్ ఆర్ ఎఫెక్ట్..!

Published on Jul 2, 2020 7:32 am IST

కరోనా వైరస్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి అతిపెద్ద అవరోధంగా తయారైంది. షూటింగ్స్ కి అనుమతి దొరికినా విపరీతంగా ఉన్న వైరస్ వ్యాప్తి వలన రాజమౌళి షూటింగ్ మొదలుపెట్టలేకున్నారు. ఆర్ ఆర్ ఆర్ హీరోలతో పాటు మరికొందరు నటులు షూటింగ్ లో పాల్గొనడానికి సుముఖతతో లేరని సమాచారం. కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లేటవడం కారణంగా అది మహేష్ మూవీపై ప్రభావం చూపుతుంది.

రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ప్రకటించగా అది 2021లో మొదలుకావాల్సివుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ 2021 జనవరిలో విడుదల చేయాలని భావించిన రాజమౌళి మహేష్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి 2021 చివర్లో లేదా 2022 ప్రారంభంలో మొదలుపెట్టాలనే ఆలోచన చేశారు. నెలల తరబడి వాయిదాపడుతున్న ఆర్ ఆర్ ఆర్ విడుదల లేటయ్యేకొద్దీ మహేష్ మూవీ వెనక్కి వెళుతుంది. ఇది మహేష్ ఫ్యాన్స్ ని కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే.

సంబంధిత సమాచారం :

More