ఇంటర్వ్యూ : క్యాథరిన్ థ్రెస – ఇప్పటి వరకు సంపత్ నంది చేసిన స్క్రిప్ట్స్ లో బెస్ట్ స్క్రిప్ట్ ఇదే !
Published on Jul 25, 2017 4:44 pm IST


‘సరైనోడు’ సినిమాలో ఎమ్మెల్యే లాంటి బలమైన క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ క్యాథరిన్ థ్రెస ప్రస్తుతం గోపీచంద్ నటించిన ‘గౌతమ్ నంద’ సినిమాలో కూడా నటించారు. ఈ శుక్రవారం చిత్ర విడుదల సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) నా క్యారెక్టర్ పేరు ముగ్ద. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. నటించటానికి స్కోప్ ఉన్న పాత్ర. గ్లామరస్ గా కూడా ఉంటుంది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.

ప్ర) ఈ సినిమాకి డబ్బింగ్ స్వయంగా చెప్పినట్టున్నారు ?
జ) అవును. మొదటి నుండి డబ్బింగ్ చెప్పాలనేది నా కోరిక. అలా చేస్తే పాత్రలో రియాలిటీ వస్తుంది. మొదటి సినిమా ఇద్దరమ్మాయిలతో దగ్గర్నుంచి ట్రై చేస్తున్నా. చివరికి గౌతమ్ నందకు కుదిరింది.

ప్ర) ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) అయన్ క్యారెక్టర్లలో గౌతమ్, నంద అనే రెండు షేడ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. గోపీచంద్ గారికి కూడా చాలా బాగా నటించారు. నాకు తెలిసి ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని పాత్రల్లో ఎక్కువ స్టైలిష్ గా ఉండే పాత్ర ఇదే. ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఇందులో కనిపిస్తుంది.

ప్ర) హన్సికతో కలిసి నటించడం ఎలా ఉంది ?
జ) ఆమెతో కలిసి పనిచేయడం ఒక మంచి అనుభవం. ఆమెకు నాకు క్లైమాక్స్ లో కాంబినేషన్ సీన్ ఉంటుంది. ఈ సినిమాలో హన్సిక డీగ్లామర్ గా నటించారు.

ప్ర) ‘సరైనోడు’ లాంటి పెద్ద హిట్ తర్వాత కూడా ఇలా అసెకండ్ హీరోయిన్ గా చేయడం ఎందుకు ?
జ) ‘సరైనోడు’ లో నా పాత్ర ఎలా ఉంటుందో ఇందులో కూడా అంతే బలంగా ఉంటుంది. నాకు కథ ఏంటి, పాత్రకు ఇంపార్టెన్స్ ఉందా లేదా, పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉందా, టీమ్ ఎలాంటిది అనేది మాత్రమే చూస్తాను. అంతేగాని సెకండ్ హీరోయిన్ అని అనుకోను.

ప్ర) గోపీచంద్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) గోపీచంద్ హోమ్లీ హీరో. ఆయన్ను ఫస్ట్ టైం సెట్లోనే కలిశాను. చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. అన్నింటినీ మించి మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. కష్టపడి పనిచేస్తారు.

ప్ర) మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం ?
జ) నాకు స్ట్రాంగ్ గా ఉండే క్యారెక్టర్స్ అంటే ఇష్టం. అలాంటి వాటిలో నటించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నాకు డ్యాన్స్ బాగా వచ్చు. అందుకే నా క్యారెక్టర్ కి డ్యాన్సులు ఉంటే ఇంకా బాగుటుంది.

ప్ర) ఇందులో ఇద్దరు హీరోయిన్లు కదా ఇబ్బంది అనిపించలేదా ?
జ) లేదు. నేను చేసిన సినిమాల్లో చాలా వరకు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ ఏమీ లేదు. పైగా నా పాత్రకు ఇంపార్టెన్స్ కూడా ఉంది.

ప్ర) సంపత్ నంది వర్క్ గురించి చెప్పండి ?
జ) ఆయన ఇప్పటి వరకు చేసిన స్క్రిప్ట్స్ లో ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అని నేను అనుకుంటున్నాను. చాలా బాగా తీశారు. ఆయన సినిమాల్లో రైన్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో కూడా అలాంటిదే ఒకటుంది. నటీ నటుల్ని ఎక్కువ అందంగా ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు. ఇందులో ఆయన హీరోయిజం మీద వెళ్లకుండా స్క్రిప్ట్ మీద సినిమాను తీశారు.

ప్ర) ‘నేనే రాజు నేనే మంత్రి’ లో ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు ?
జ) ఇందులో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. బోల్డ్ గా కూడా ఉంటుంది. ఒక్క పాత్రలో అనేక వేరియేషన్స్ ఉంటాయి. ఆ పాత్ర చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.

ప్ర) తేజగారితో వర్క్ కష్టమనిపించలేదా ?
జ) లేదు. ఆయన మారిపోయినట్టున్నారు (నవ్వుతూ). అయన నాకు తెలీక ముందు చాలా మంది చాలా చెప్పారు. కానీ ఆయన అలా కాదు. సెట్లో చాలా సరదాగా ఉంటారు. స్టీరియో టైప్ కథల్ని, పాత్రల్ని బ్రేక్ చేయడానికే ఈ చేశారాయన.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) తమిళంలో ఒకటి చేస్తున్నాను. ఇక తెలుగులో ఇప్పటికైతే వేటికీ సైన్ చేయలేదు. చేయగానే అనౌన్స్ చేస్తాను.

ప్ర) తెలుగు బాగా మాట్లాడుతున్నారు . ఎక్కడ నేర్చుకున్నారు ?
జ) నిజం చెప్పాలంటే (నవ్వుతూ) ఒక తెలుగు మాస్టర్ ను అపాయింట్ చేసుకున్నాను. అయన ఉస్మానియా యూనివర్సిటీలో వర్క్ చేస్తారు. ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఇంకా సెట్లో అందరూ తెలుగు మాట్లాడతారు కాబట్టి అక్కడ కూడా కొంత నేర్చుకున్నాను.

ప్ర) టాలీవుడ్లో డ్రగ్స్ ఇష్యూ పై మీ కామెంట్స్ ?
జ) అంటే దాని గురించి నాకు అప్డేట్స్ తెలీవు. ఏదైనా కూడా డ్రగ్స్ అనేవి మంచిది కాదు. దేవుడిచ్చిన ఈ లైఫ్ ను డ్రగ్స్ అంటూ నాశనం చేసుకోకూడదు. డ్రగ్స్ కన్నా ఆనందాన్ని ఇచ్చేవి చాలా ఉన్నాయి. నా వరకు నేను డ్రగ్స్ కు పూర్తిగా వ్యతిరేకం.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook