ఆ రెండు లుక్స్ ఎన్టీఆర్ ఎలా బ్యాలన్స్ చేస్తాడు..?

Published on Apr 8, 2020 7:55 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ లేని విధంగా రెండేళ్లు వెండి తెరకు దూరం అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ కారణంగా ఆయన 2019తో పాటు 2020 కూడా మిస్ కానున్నారు. ఐతే 2021లో ఆయన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తక్కువ వ్యవధిలో ఫ్యాన్స్ కి అందించనున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ 2021జనవరిలో విడుదల కానుండగా త్రివిక్రంతో చేస్తున్న 30వ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ మే నుండి త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొననున్నాడు.

ఐతే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం రోల్ చేస్తుండగా, ఆయన పెరిగిన జుట్టు, కోరమీసంతో ఉన్నారు. కొమరం భీమ్ లుక్ కోసం ఎన్టీఆర్ అలా తయారు కావడం జరిగింది. మరి త్రివిక్రమ్ మూవీ మోడరన్ డేస్ నేపథ్యంలో ఉంటుంది. మే నుండి ఎన్టీఆర్ అదే లుక్ తో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఎలా పాల్గొంటాడు అనేది పెద్ద ప్రశ్న. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చిత్రీకరణ ఇంకా మిగిలివున్న నేపథ్యంలో ఎన్టీఆర్ తన మీసం, కానీ జుట్టు కానీ తగ్గించలేని పరిస్థితి. భిన్న నేపద్యాలు కలిగిన ఈ రెండు చిత్రాల కోసం ఎన్టీఆర్ లుక్ ఎలా అడ్జస్ట్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More