‘శ్రీనివాస కళ్యాణం’ కథ ఇదేనంటూ తెగ హడావుడి !

‘శ్రీనివాస కళ్యాణం’ కథ ఇదేనంటూ తెగ హడావుడి !

Published on Aug 6, 2018 6:43 PM IST

Srinivasa Kalyanam1

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా ఆగష్టు 9న విడుదల అవ్వబోతున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఐతే ఈ చిత్రకథ ఇదేనంటూ ఓ ఆసక్తికరమైన పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. విషయంలోకి వెళ్తే సంపన్న కుటుంబాల్లో పుట్టి పెరిగిన హీరో హీరోయిన్లు పేమించుకుంటారు, కానీ వారికి పెళ్లి మీద సరైన అభిప్రాయం ఉండదు. దాంతో ఎప్పుడన్నా గొడవలు వస్తే విడిపోవచ్చు అనే అగ్రిమెంట్ మీద హీరో హీరోయిన్లు ఇద్దరూ కట్టుబడి ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న వారి పెద్దవాళ్ళు, పెళ్లి మీద హీరో హీరోయిన్లకు ఉన్న అభిప్రాయాన్ని పొగడటానికి పెళ్లి విశిష్టతను చాటి చెప్పేలా వారి పెళ్లిని జరిపించి, వారికి కనువింపు కలిగిస్తారు. క్లుప్తంగా ఇదే కథ అని సోషల్ మీడియాలో ఈ పాయింట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా రాశీఖన్నా, నందిత శ్వేతలు కథానాయకిలుగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమా పై నితిన్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి నితిన్ ఆశించినట్లు ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు