వెంకటేష్ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట !

వెంకటేష్ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట !

Published on Apr 3, 2020 1:00 AM IST

‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తన 74వ చిత్రంగా ‘నారప్ప’ సినిమాని చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా, ఈ సినిమా కోసం వెంకటేష్ తన పారితోషికాన్ని రెట్టింపు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తాజా గాసిప్ ఏమిటంటే, వెంకటేష్ ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని.. కేవలం లాభాలలో షేర్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలోని వెంకీ లుక్ కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ‘నారప్ప’గా విక్టరీ వెంకటేష్‌ లుక్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మాస్‌ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్‌ చేయనున్నారు విక్టరీ వెంకటేష్‌. కాగా సినిమాలో కూడా వెంకీ నారప్పగా కనిపించడానికి చాల కసరత్తులు చేశారట. ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకున్నారట. ఒక క్యారెక్టర్ కోసం గతంలో వెంకీ ఇలా ఎప్పుడూ చేయలేదట. మొత్తానికి నారప్ప కోసం వెంకీ చాల మారాడు.

ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్‌ లొకేషన్లలో కీలక సన్నివేశాలను తరువాత షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. కాగా తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు