చివరి వరకు సాగిన సస్పెన్సులో ఆ ఇద్దరిలో ఒకరు అవుట్.

Published on Oct 21, 2019 7:25 am IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా సక్సెస్ఫుల్ గా సాగుతున్న బిగ్ బాస్ సీసన్ 3 నిన్నటితో 92 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. చివరి వరకు ఆటపాటలతో అలరించిన షో చివర్లో ఎమోషనల్ ఎలిమినేషన్ తో ముగిసింది. ఈ వారానికి ఎలిమినేషన్ కి గాను హౌస్ లో ఉన్న ఏడుగురు సభ్యులు నామినేట్ కావడంతో అటు ప్రేక్షకులతో పాటు, ఇటు ఇంటి సభ్యులలో ఉత్కంఠ నెలకొంది. కేవలం ఇంకొద్ది రోజులలో బిగ్ బాస్ విన్నర్ తేలనున్న తరుణంలో ఇప్పుడు ఎవరు వెళ్లిపోనున్నారు అని ఆసక్తి నెలకొంది.

కాగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వాస్తవం చేస్తూ, వితిక షేరు ఎలిమినేట్ కావడం జరిగింది. ఐతే ఏడుగురు సభ్యులలో ఐదుగురు సేఫ్ కాగా చివరికి ఎలిమినేషన్ కొరకు వరుణ్, వితిక మిగిలారు.వీరిద్దరిలో ఎవరు వెళ్ళిపోతారనేది ఉత్కంఠగా సాగింది.బోర్డు పై ఎవరి పేరును నేను పూర్తిగా రాస్తానో, వారు సేఫ్ మిగిలిన వారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పిన నాగ్, వరుణ్ పేరు రాయడంతో…, వితిక ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ సంఘటనకు వరుణ్ ఎమోషనల్ కాగా వితిక టేక్ ఇట్ ఈజీ గా తీసుకోవడం విశేషం.వరుణ్ కి కొన్ని సలహాలు ఇచ్చిన వితిక అందరికి సెండ్ ఆఫ్ చెప్పి బయటికి వచేసింది.

సంబంధిత సమాచారం :

X
More